
నిర్మాణ కౌశలం.. నిమ్మల
నిర్మల్: ఎప్పుడో 450 ఏళ్ల కిందట నిర్మితమైన నిర్మల్ (నిమ్మల) జిల్లా కేంద్రం లోపల, చుట్టూ బురుజులు, గఢ్‌లు ఇప్పటికీ నాటి ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని చాటుతున్నాయి. నిమ్మనాయుడు నిర్మించిన అనంతరం కుంటి వెంకట్రాయుడు, శ్రీనివాసరావుల కాలంలో నిమ్మల చాలా నిర్మాణాలకు నోచుకుంది. శత్రువులతో పాటు, దొంగల దాడుల నుంచి రక్షణ కోసం పటిష్టమైన రక్షణ నిర్మాణాలు చేపట్టారు. మూడంచెల రక్షణ వ్యవస్థను నిర్మించారు. వీటిలో ఖిల్లాగుట్ట, కురన్నపేటబురుజు, బత్తీస్‌గఢ్, రాణి (వేంకటేశ్వర)గఢ్, గజ్‌గఢ్, ఇబ్రహీంగఢ్, శ్యామ్‌గఢ్, సోన్‌గఢ్, చిట్టిగఢ్, బీరవెల్లి గఢ్, వడూర్ (వైడూర్యపురం) గఢ్ వంటివి ఉన్నాయి.
నిమ్మల నిర్మాణం అద్భుతం
తెలంగాణలో ఓరుగల్లు, గోల్కొండ రాజ్యాలకు ఏమాత్రం తీసిపోని విధంగా నిమ్మల రాజ్యంలో నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ గోండు, ఫ్రెంచ్‌తో పాటు స్థానిక రాజ్యాల నిర్మాణశైలిలో కట్టడాలు ఉండటం ప్రత్యేకం. సారంగపూర్ మండలం జౌళి నుంచి నిర్మల్ సమీపంలోని వెంకటాపూర్ వరకు 16 గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. ఇవన్నీ ఎత్తు, వాలు ఆధారంగా గొలుసుకట్టుతో నిర్మించడం విశేషం. – డా.కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్

నిర్మాణ కౌశలం.. నిమ్మల