
ఆకాశవాణిలో కడ్తాల్ విద్యార్థుల కథలు
సోన్: మండలంలోని కడ్తాల్ ప్రాథమిక పాఠశాలను ఆకాశవాణి ఆదిలాబాద్ రేడియో కేంద్రం సిబ్బంది శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థులు పాటలు, కథలు, మాటలు, నాటికలు రికార్డు చేసుకున్నట్లు హెచ్‌ఎం రమేశ్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమం ఈనెల 14 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు ఆదిలాబాద్ రేడియో కేంద్రంలో ప్రసారమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది దినేష్, లెనిన్ పాఠశాల ఉపాధ్యాయులు మంగమ్మ, రాధ, మౌనిక రాణి విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కోసం వినతి
కడెం: మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) డివిజన్ కార్యాదర్శి సునారి కారి రాజేశ్ కోరారు. స్థానిక నాయకులతో కలిసి ఉట్నూర్‌లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌కు, ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూగుప్తాకు శుక్రవారం వినతిపత్రం అందించారు. 70 ఏళ్లుగా చెట్ల కింద గుడారాల్లో, గుడిసెల్లో జీవిస్తున్నా వీరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి అదుకోవాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో ఐటీఎఫ్ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, అడ్వకేట్ నేదూరి జాకబ్, లలితకుమారి, చెంచులు శిరీష, చంద్రకళ, లక్ష్మి తదితరులు ఉన్నారు.