
జిల్లా కవులను గుర్తించాలి
నిర్మల్‌టౌన్: రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కవులను గుర్తించాలని ప్రముఖ కవి, రచయిత డాక్టర్ దామెర రాములు అన్నారు. నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మాట్లాడారు. జిల్లాలో వచన కవిత్వం, పద్య కవిత్వం, వ్యాసాలు, కథలు, కథానికలు, తాత్విక వ్యాసాలు రాసిన చేయి తిరిగిన కవులు రచయితలు ఎంతో మంది ఉన్నారని తెలిపారు. వారి రచనలు జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రసిద్ధి చెందా యని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్స్‌రే, రంజని కుందర్తి, సినారే అవార్డులు అందుకు న్న కవులు కూడా ఇక్కడ ఉన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోరాట యోధుల గడ్డా అని, ఈ జిల్లాను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ జిల్లాలో ఎంతోమంది కవులు, రచయితలు ఉన్నా గుర్తింపు లేదన్నారు. ఇప్పటికై నా అవార్డుల కమిటీ దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మల్ జిల్లా కవులను పరిగణనలోకి తీసుకుని గద్దర్, దాశరథి అవార్డులు అందించాలని కోరారు. జిల్లా కవులు, రచయితలు డాక్టర్ కృష్ణంరాజు, నేరెళ్ల హనుమంతు, భీమేష్ పాల్గొన్నారు.
మన్మద్ ఎత్తిపోతలకు నిధులు
లోకేశ్వరం: మండలంలోని మన్మద్ ఎత్తిపోతల పథకానికి మరమ్మత్తుల కోసం నిధులు మంజూరయ్యాయని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. రూ.1.61 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. త్వరలో టెండర్ పూర్తిచేసి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.