
న్యాస్‌కామ్‌తో ఆర్జీయూకేటీ ఒప్పందం
బాసర: ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో డిజిటల్ రంగంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే దిశగా ఆర్జీయూకేటీ విద్యార్థులు, అధ్యాపకుల్లో పునర్ వైభవాన్ని పెంపొందించే లక్ష్యంతో ముందుకెళ్తామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపా రు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఆర్జీయూకేటీ, న్యాస్‌కామ్‌తో ఒప్పందం కుదుర్చుకుందని పే ర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా డిజిటల్ రంగంలో వేగంగా మారుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్, సైబర్ సెక్యూరిటీ తదితర నూతన సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు శిక్షణ పొందే అవకాశం కలు గుతుందని తెలిపారు. అకాడమిక్ విభాగాల వారీ గా ప్రత్యేక సమన్వయకర్తలను నియమించి విద్యార్థులకు ప్రాక్టికల్, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులను భవిష్యత్ ఉద్యోగావకాశాలకు సిద్ధం చేస్తుందని, అధ్యాపకుల్లో నైపుణ్యం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందిస్తుందని చెప్పారు. అనంతరం ఓ ఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ మాట్లాడుతూ.. బాస ర ఆర్జీయూకేటీ దేశంలో డిజిటల్ విద్యా ఆవిష్కరణలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. న్యాస్ కామ్ డైరెక్టర్ ఉదయ్‌శంకర్, డీన్స్ చంద్రశేఖర్, మహేశ్, విఠల్, విద్యార్థులు పాల్గొన్నారు.