
తప్పుడు కేసులతో అణచివేయొద్దు
ఆదిలాబాద్‌టౌన్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా సాక్షి తెలుగు దినపత్రికకు సంబంధించిన జర్నలిస్టులపై తప్పుడు కేసులతో అణచివేయాలని చూడడం సరికాదు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్‌కాన్ఫరెన్స్‌ల వార్తలు రాసిన సందర్భంలోనూ ఎడిటర్‌తోపాటు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం చోద్యం. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు సరికాదు.
– బేత రమేశ్, టీయూడబ్ల్యూజే
(143హెచ్), ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు