
● సరస్వతీ కొలువైనా జిల్లాపై చిన్నచూపా? ● విశ్వవిద్యాలయం
నిర్మల్: చదువుల తల్లే కొలువుదీరిన జిల్లా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన నేతలున్న ఖిల్లా. ఉమ్మడి జిల్లాకే రాజకీయకేంద్రంగా పేరున్న నిమ్మల. ఇలా.. అన్నీ ఉన్నా.. చదువుల్లో మాత్రం సున్నా చుడుతోంది. దశాబ్దాలు గడిచిపోతున్నా.. ఉన్నతవిద్య అందని ద్రాక్షే అవుతోంది. విశ్వవిద్యాలయం పెడతామ ని పాలకులు హామీలిచ్చినా.. హైదరాబాద్–ఢిల్లీ మధ్య సంబంధిత ఫైళ్లు తిరుగుతున్నా.. అడుగు ముందుకుపడటం లేదు. అడిగేవారు లేకనే.. జిల్లాపై పాలకులు, అధికారులు చిన్నచూపు చూస్తున్నారనే వాదనా జిల్లావాసుల్లో పెరుగుతోంది.
హామీలిచ్చి ఏళ్లు గడుస్తున్నా..
అక్షరక్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను విద్యారంగంలోనూ ముందంజలో ఉంచుతామంటూ.. ప్రతీ పాలకుడూ చెబుతూనే వస్తున్నా రు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనలున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ యూనివర్సిటీ ఏర్పాటు హామీ ఇస్తూ పోయారు. అప్పటికప్పుడు ప్రతిపాదనలు తీసుకుంటూ ఫైళ్లకు ఫైళ్లు తయారు చేయిస్తూ నే ఉన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర మానవ వనరులశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ)కి పంపుతున్నామని చెబుతూ నే ఉన్నారు. కానీ.. ఇప్పటికీ యూనివర్సిటీ ఏర్పా టు దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలే దు. కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తల్లి ఉన్నా.. చదువు సున్నా..
దేశంలోనే ప్రసిద్ధ చదువులక్షేత్రం బాసర జ్ఞానసరస్వతీమాత కొలువైన చోటనే సరైన విద్య లేకపోవడం దారుణం. చదువులమ్మ చెంతనే ఆర్జీయూకేటీ ఉన్నా.. జిల్లా విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదు. పదోతరగతిలో వ చ్చే మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉండటంతో స్థానిక విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ఉన్న ఒక్క పీజీ సెంటర్‌నూ నామ్‌కే వాస్తేగా మార్చేశారు. డిగ్రీ కాలేజీల్లోనూ ఇప్పటికీ సంప్రదా య కోర్సులే గాని.. ఒక్కటంటే ఒక్క ప్రత్యేక కోర్సు పెట్టడం లేదు. ఇక ఇంజినీరింగ్ కాలేజీ కావాలి ప్రభో.. అని ఏళ్లుగా వేడుకుంటున్నా.. కనికరించ డం లేదు. అందరికీ అక్షరాభ్యాసం చేయించే చదువులమ్మ ఉన్న చోటనే.. సరైన చదువుల వ్యవస్థలు లేకపోవడం అత్యంత దారుణం.
అన్ని వసతులున్నా..
ప్రభుత్వం యూనివర్సిటీ పెట్టడంలో జాప్యం చే యడానికి కారణాలు తెలియడం లేదు. నిర్మల్‌లో ప్రస్తుతం ఉన్న డిగ్రీ కాలేజీ, పీజీసెంటర్, రెండు ఇంటర్ కాలేజీలకు కలిపి 40ఎకరాల భూమి ఉంది. డిగ్రీ కాలేజీకే భవనంతో పాటు 16ఎకరాల వరకు ఉంది. యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే తాత్కాలికంగా తరగతులు నిర్వహించేందుకు సరిపడా భవనా లున్నాయి. స్థానికంగా సరైన విద్యావ్యవస్థలు లేక వేలాదిమంది విద్యార్థులు ఇప్పటికీ హైదరాబాద్ వరకూ వెళ్తున్నారు. నిర్మల్ ప్రాంతం ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకూ అందుబాటులో ఉంటుంది. 44, 61 నేషనల్ హైవేలున్నాయి. తాజాగా హైదరాబాద్–ఆదిలాబాద్ వయా నిర్మల్ రైల్వేలైన్‌కు సంబంధించి కూడా రైల్వేశాఖ డీపీఆర్ సిద్ధం చేస్తోంది.
నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల