
సమన్వయంతో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా అభివృద్ధిలో కీలక అంశాలపై శాఖల మధ్య సమన్వయం అవసరమని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల నిర్మూలన, బాల్యవివాహాల నివారణ, నకిలీ విత్తనాల అమ్మకాలు, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. విత్తన దుకాణా ల్లో నిరంతరం తనిఖీలు చేయాలన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా ఇప్పటివరకు 32 మంది బాల కార్మికులను గుర్తించి, 19 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. బాల్యవివాహాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ ఏడాది 12 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్యవివాహాలపై అవగాహన కల్పించామన్నారు. పీసీ–పీఎన్‌డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టం అమలులో ఇప్పటివరకు 51 కేసులు నమోదవగా, 39 కేసుల్లో పరిహారం చెల్లించామని, 12 కేసులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్ప టి వరకు 73 కేసులు నమోదు కాగా, 145 మంది అరెస్టయ్యారని, 525 కేజీల 305 గ్రాముల గంజా సీజ్ చేశామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను ని వారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్‌ఎచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ శాఖల ద్వారా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కడ్తాల్, సోన్ గ్రామస్తులు, ఇతర గ్రామాల పరిధిలోని నేషనల్ హైవే రూట్లపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భిక్షాటన నిర్మూలన, ట్రాఫిక్ సమస్యలపై చర్యలు తీసుకోవాలన్నారు.
సంక్షేమ, పోలీసు శాఖల మధ్య సమన్వయం..
ఎస్పీ జానకీషర్మిల మాట్లాడుతూ, బాల్యవివాహాల నియంత్రణలో సంక్షేమ, పోలీసు శాఖల మధ్య స మన్వయం కొనసాగుతుందన్నారు. చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణకు తనిఖీలు పెంచామన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రాధిక, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, అడిషనల్ ఎస్పీ ఉపేంద్రారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.