
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
నిర్మల్‌టౌన్: భావితరాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జ్ఞాన సరస్వతి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని జ్ఞానసరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నంగే శ్రీని వాస్ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో గురువారం మా ట్లాడారు. సమగ్ర విద్యాభివద్ధిలో భాగంగా భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా కొత్త విద్యాలయాలు అవసరమన్నారు. దివంగత ము ఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో అన్ని జిల్లాల్లో విశ్వవిద్యాలయాల ఏర్పాటు జరిగిందన్నా రు. 2009లో జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలను శ్రీజ్ఞానసరస్వతి యూనివర్సిటీగా నామకరణం చేసి రూ.55 కోట్లు మంజూరుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కానీ వైఎస్సార్ అకాల మరణంతో ఈ ప్రక్రియ నిలిచిపోయి రాష్ట్ర విభజన సమయంలో మరుగున పడిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూనివర్సిటీల ఏర్పాటు జరగలేదని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.