
ఘనంగా గురు పౌర్ణమి
నిర్మల్‌టౌన్: గురు పౌర్ణమిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. జిల్లాలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని గండి రామన్న క్షేత్రంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి ఆలయంలో అభిషేకం అర్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 48 గంటలపాటు కొనసాగిన అఖండ సాయినామ సంకీర్తన మధ్యాహ్నం 12 గంటలకు ముగిసింది. మధ్యహ్న హారతి అనంతరం వేలాది సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.