
మత్తుకు దూరంగా ఉండాలి
పెంబి: యువత మత్తు, మాదకద్రవ్యాలకు దూ రంగా ఉండాలని ఎస్పీ జానకీషర్మిల సూచించా రు. గంజాయి రహిత నిర్మల్‌లో భాగంగా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్, కోలాంగూడ గ్రామాలను ఏఎస్పీ రాజేశ్‌మీనతో కలిసి గురువారం సందర్శించారు. దట్టమైన అటవీ ప్రాంతంగుండా ఎడ్ల బండిలో గ్రామాలకు చేరిన ఎస్పీకి ఆదివాసీలు గుస్సాడీ వేషధారణతో, డోలు చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువతకు గంజాయి, కల్తీ కల్లుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. గంజాయి సాగు చట్టవిరుద్ధమని తెలిపారు. ఎవరైనా సాగుచేస్తే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
ప్రమాణం చేయించిన ఎస్పీ..
గ్రామస్తులతో గంజాయి సాగు, సేవనం, కల్తీ కల్లు, నిషేధిత గుడుంబా వినియోగం నివారించాలని ఎస్పీ గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. వాలీబాల్ నెట్‌లు, రైతులకు వర్షం నుంచి రక్షణ కవర్లు, పలువురికి రేషన్ బియ్యం పంపిణీ చేశారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 100 లేదా 8712659599 ద్వారా తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్, ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సమ్మయ్య, పెంబి ఎస్సై హన్మాండ్లు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ జానకీషర్మిల

మత్తుకు దూరంగా ఉండాలి