
ముందస్తు చర్యలు తీసుకోవాలి
నిర్మల్‌టౌన్: వ్యాధుల నియంత్రణకు ముందస్తు చ ర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో జిల్లా వై ద్యాధికారులతో సమావేశమయ్యారు. కాలానుగుణ వ్యాధుల నివారణ, టీబీ నిర్మూలన తదితర అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. వానా కాలంలో వ్యాధులు విజృంభించే ప్రమాదమున్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించా రు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా వ్యాధి ని ర్ధారణ కిట్లు, ఔషధాలు సిద్ధంగా ఉంచాలని సూ చించారు. టీబీని నిర్మూలించేందుకు ‘టీబీ ముక్త భారత్’ కార్యక్రమం పరిధిలో అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆదేశించారు. టీబీ బాధితులకు సమయానికి వైద్యసేవలు అందించి, వారిని ఆ రోగ్యవంతులుగా మార్చాల్సిన బాధ్యత వైద్యాధికా రులదేనని స్పష్టం చేశారు. జిల్లా వైద్యాధికారి రా జేందర్, డీసీహెచ్ డాక్టర్ సురేశ్, అధికారులు రవీందర్, రాజారమేశ్, ఆశిష్‌రెడ్డి, భోజారెడ్డి ఉన్నారు.
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్