
బైక్‌ల దొంగ అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: ద్విచక్ర వాహనం దొంగలించిన ఆదిలా బాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన షేక్ నదీమ్‌ను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. పట్టణంలోని సుభాష్‌నగర్‌కు చెందిన మహ్మద్ షాబాద్‌ఖాన్ ఏప్రిల్ 11న బస్టాండ్‌లో పల్సర్ బైక్ పార్కింగ్ చేసి నిర్మల్‌కు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చిన ఆయన బైక్ కనిపించకపోవడంతో 15న టూటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఇందిరానగర్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిందితుడు అటువైపు నుంచి బైక్‌పై వస్తుండగా అనుమానం వచ్చి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విచారించగా రెండు బైక్‌లు చోరీ చేసినట్లు తెలిపాడు. నిందితుడిపై ఇదివరకే రూరల్ పోలీసు స్టేషన్‌లో 2, టూటౌన్ పోలీసు స్టేషన్‌లో 2 చోరీ కేసులు ఉన్నట్లు చెప్పారు.