
ద్విచక్ర వాహనం చోరీ
తానూరు : మండల కేంద్రంలోని జాదవ్ వెంకటేశ్‌కు చెందిన (పల్సర్) ద్విచక్ర వాహనం చోరికి గురైనట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు. శనివారం రాత్రి వెంకటేశ్ తన ఇంటిముందు నిలిపి ఉంచాడు. ఆదివారం ఉదయం చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రాయితీ బియ్యం పట్టివేత
నార్నూర్: రాయితీ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచి పేదలకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పీ.ప్రభాకర్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం గాదిగూడ మండల కేంద్రంలో దాడులు నిర్వహించగా కూర శివాజీ దుకాణంలో 17.6 క్వింటాళ్లు, లోకారి–కే గ్రామంలో షేక్ జావిద్ కిరాణా దుకాణంలో 7.3 క్వింటళ్ల ప్రభుత్వ రాయితీ బియ్యం లభించినట్లు పేర్కొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు.