సాగులో సవాళ్లు..! | - | Sakshi
Sakshi News home page

సాగులో సవాళ్లు..!

Jun 19 2025 4:44 AM | Updated on Jun 19 2025 4:44 AM

సాగుల

సాగులో సవాళ్లు..!

నిర్మల్‌
కేజీబీవీల్లో నూతన మెనూ
కేజీబీవీల్లో బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మెనూలో పలు మార్పులు చేసింది.
● వరి ధాన్యం మద్దతు ధర రూ.69 పెంచిన కేంద్రం ● పచ్చిరొట్ట ఎరువుల సబ్సిడీ 10 శాతం తగ్గించిన రాష్ట్రం ● దొడ్డు రకం వడ్లకు ఇప్పటికీ బోనస్‌ లేదు ● సన్న వడ్లు దిగుబడి రాదు.. ● అవసరానికి అంద ని రైతు భరోసా

గురువారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లోu

ఉపకరణాల దరఖాస్తు గడువు పొడిగించాలి

నిర్మల్‌చైన్‌గేట్‌: దివ్యాంగుల సహాయ ఉపకరణాల దరఖాస్తు గడువు ఈనెల 30 వరకు పొడిగించాలని కోరుతూ దివ్యాంగుల పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సట్టి సాయన్న బుధవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపకరణాలకోసం ఈనెల 7 నుండి 18 వరకు కేవలం 11 రోజులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడానికి మారుమూల ప్రాంత దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముత్యం, నాయకులు సముద్రాల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

భైంసా : జిల్లాలో గోదావరి నది తీరంలో వరి పంట ప్రధాన వ్యవసాయంగా కొనసాగుతోంది. 53 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలో దాదాపు 70 వేల ఎకరాలకుపైగా వరి సాగవుతుంది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఆయకట్టు కింద 18 లక్షల ఎకరాల్లో సింహభాగం వరి పంటే ఉంది. అయితే, భారీ వర్షాలతో నది ఉప్పొంగి పంట నష్టం జరుగుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దీంతోపాటు, తక్కువ మద్దతు ధర, సబ్సిడీల తగ్గింపు, దొడ్డు రకం వరికి బోనస్‌ లేకపోవడం, పంటల బీమా అమలు చేయకపోవడం వంటి సమస్యలు రైతులను కలవరపెడుతున్నాయి.

సబ్సిడీ తగ్గింపుతో భారం..

సాగులో భూమి సారవంతం కోసం రైతులు జీలుగులు, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులను వినియోగిస్తారు. గతేడాది 60 శాతం సబ్సిడీతో 30 కేజీల జీలుగు బస్తా రూ.1,116, 40 కేజీల జనుము బస్తా రూ.1,448కి అందుబాటులో ఉండేవి. ఈ ఏడాది సబ్సిడీని 50 శాతానికి తగ్గించడంతో 30 కేజీల జీలుగుబస్తా రూ.2,138, 40 కేజీల జనుము బస్తా రూ.2,510కి పెరిగింది. ఈ ధరల పెంపుతో రైతులు పచ్చిరొట్ట ఎరువులు కొనలేక, ప్రైవేటు దుకాణాల్లో పెసర బ్యాగులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

దొడ్డు వడ్లకు ఇవ్వని బోనస్‌..

నిర్మల్‌ జిల్లాలో వరి సాగులో 60 శాతం రైతులు దొడ్డు రకం వరిని పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందిస్తున్నప్పటికీ, దొడ్డు రకానికి ఈ సౌకర్యం లేదు. సన్నరకం వరి సాగు చేసే రైతులు చీడపీడల నివారణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉండగా, ఎకరానికి 14 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోంది. అయితే, దొడ్డు రకం వరి ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా దిగుబడినిస్తుంది. అయినా దొడ్డు రకానికి బోనస్‌ లేకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మద్దతు ధర, సబ్సిడీల తగ్గింపు, దొడ్డు రకం వరికి బోనస్‌ లేకపోవడం వంటి సమస్యలు రైతుల ఆర్థికస్థితిని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం వరి రైతులకు న్యాయమైన మద్దతు ధర, సబ్సిడీలు, బోనస్‌ సౌకర్యాలను అందించాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

రైతు భరోసా ఆలస్యం.

ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అందించే పెట్టుబడి సాయం ఆలస్యం అవుతోంది. మొదటి ఏడాది చాలా మందికి రైతుభరోసా ఇవ్వలేదు. గత యాసంగిలో కూడా ఐదెకరాల లోపు మాత్రమే రైతుభరోసా చెల్లించింది. అదీ ఆలస్యమైంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కోసం మళ్లీ అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు

వరి రైతులకు ఈయేడు కూడా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్నాం. 30 కేజీల జీలుగు సంచి 50 శాతం సబ్సిడీతో రూ.2,138 చెల్లించి తీసుకెళ్లాలి. 40 కేజీల జనుము సంచి 50 శాతం సబ్సిడీతో రూ.2,510 చెల్లించి తీసుకెళ్లాలి. 30 కేజీల పచ్చిరొట్ట విత్తనాలు రెండున్నర ఎకరాలకు సరిపోతాయి.

– అంజిప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి

పెసర వేస్తున్నాం

పచ్చిరొట్ల విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఏటా జీలుగు, జనుము చల్లేవాళ్లం. ఈ ఏడాది 30 కిలోల బస్తా రూ.2,138 చెల్లించాల్సి వస్తోంది. అంత మొత్తం పెట్టి ఏ రైతు కొనలేడు.

– కొండ శ్రీనివాస్‌, న్యూపోచంపాడ్‌

దొడ్డు వడ్లకు బోనస్‌ ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం దొడ్డురకం వరిధాన్యానికి బోనస్‌ ఇవ్వాలి. సన్నాలకు క్వింటాలుకు రూ.500 చెల్లిస్తుంది. అయినా సన్నాల సాగుకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిగుబడి తగ్గిపోతుంది. వరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

– రఘునాథ్‌, వాలేగాం

మద్దతు ధర పెరగలేదు

కేంద్ర ప్రభుత్వం వరి పంట మద్దతు ధర అంతగా పెంచలేదు. క్వింటాలుకు రూ.69 మాత్ర మే పెంచింది. దీంతో రైతులు నష్టాలపాలవుతారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నా మద్దతు ధర అంతగా పెరగడంలేదు.

– సుంకరి దత్తు, ఇలేగాం

న్యూస్‌రీల్‌

మద్దతు ధర నామమాత్రం పెంపు

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వరి ధాన్యం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని గతేడాదితో పోలిస్తే కేవలం మూడుశాతం మాత్రమే పెంచింది. సాధారణ వరిధాన్యం క్వింటాల్‌కు రూ.2,369, ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.2,389గా నిర్ణయించింది, ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం రూ.69 పెరుగుదల మాత్రమే. ఇతర పంటలతో పోలిస్తే వరి ధర పెంపు అత్యంత తక్కువగా ఉందని రైతులు పెదవి విరుస్తున్నారు. మినుములపై రూ.400, కందులపై రూ.450, జొన్నపై రూ.328, మొక్కజొన్నపై రూ.175, సజ్జలపై రూ.150, రాగులపై రూ.579, వేరుశెనగపై రూ.480, సోయాబీన్‌పై రూ.436, పొద్దుతిరుగుడుపై రూ.441, పత్తిపై రూ.589, ఒలిసెలపై రూ.820 పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల సమయంలో బీజేపీ వరిధాన్యం క్వింటాల్‌కు రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, తక్కువ పెంపుతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సాగులో సవాళ్లు..!1
1/1

సాగులో సవాళ్లు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement