కార్మికులు హక్కుల రక్షణకు ఉద్యమించాలి
నిర్మల్‌చైన్‌గేట్: కార్మికులు హక్కుల రక్షణకో సం ఉద్యమించాలని టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రాజన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీడీ ఫ్యాక్టరీలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 21, 22 తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో 44 చట్టాలను నాలుగు కోడ్స్‌గా మార్చి యాజమాన్యాలకు అనుకూలమైన చట్టాలు చేయడం అన్యాయమన్నారు. బీడీ పరిశ్రమపై విధించిన 28 శాతం జీఎస్టీ తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్, పోశెట్టి, రాజేందర్, లక్ష్మణ్, రాజు, మురళి, నరసయ్య, గంగామణి, లక్ష్మి, విజయ, కమల, కవిత, అరుణ, శ్రీనివాస్, చిన్నయ్య, ఉత్తమ్, తదితరులు పాల్గొన్నారు.


