వివేక్ అనే నేను...
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రిగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదివారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నూ ర్ నుంచి వరుసగా ఆయన సోదరుడు వినోద్ త రువాత మంత్రిగా బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. ఇప్పటికే గడ్డం ఫ్యామిలీ నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యేగా వినోద్ ఉండగా ఎంపీగా వంశీకృష్ణ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచే వివేక్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అయినప్పటికీ జిల్లా నుంచే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, బెల్లంపల్లి వినోద్ కూడా పోటీలో ఉండగా చివరకు అధిష్టా నం వివేక్ వెంకటస్వామికే మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో వివేక్ వర్గీయులు శనివారం నుంచే జిల్లాలో సంబురాలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో చెన్నూర్‌లో కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకొన్నారు. చెన్నూ ర్ పట్టణానికి చెందిన పార్టీ నాయకులు మంత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలి పారు. కార్యక్రమంలో చింతల శ్రీనివాస్ పాల్గొన్నారు. భీమారంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చారు. దండేపల్లిలో మాల సామాజిక వర్గం నాయకులు సంబరాలు జరుపుకొన్నారు.
హామీలు నెరవేర్చడమే లక్ష్యం
నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని మీడియాతో మంత్రి వివేక్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతానని ఈ సందర్భంగా తెలిపారు.
మంత్రిని కలిసిన నాయకులు
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మంచిర్యాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ కాంట్రా క్టు కార్మిక సంఘం అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్డర్ నీలకంఠేశ్వర్‌రావు, మందమర్రి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నీలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గందె రాంచందర్, కోటపల్లి మాజీ సర్పంచులు కుమ్మరి సంతోష్, గట్టు లక్ష్మణ్‌గౌడ్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జేక శేఖర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకుడు గుర్రం రాజన్న పాల్గొన్నారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్
చెన్నూర్ నుంచి అన్నయ్య వినోద్ తర్వాత మంత్రిగా తమ్ముడికి ఛాన్స్
ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు, వినోద్‌కు ఆశాభంగం
తీవ్ర నిరాశలో ప్రేమ్‌సాగర్‌రావు
కొంతకాలంగా కేబినెట్‌లో తనకు తప్పనిసరిగా స్థానం ఉంటుందని ఆశించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు తీవ్ర ఆశాభంగం కలిగింది. దీంతో ఆయన వర్గీయులు శనివారం నుంచే తీవ్ర నిరాశకు లోనయ్యారు. ప్రేమ్‌సాగర్‌రావును బుజ్జగించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రంగంలోకి దిగి ఆయనకు పలు విధాలుగా నచ్చజెప్పినట్లు తెలుస్తోంది.
వివేక్ అనే నేను...


