నిర్మల్ జిల్లా... కళల ఖిల్లా
నిర్మల్‌ఖిల్లా: నిర్మల్ జిల్లా కవులు, కళాకారులు, చరి త్రకారులకు నిలయంగా మారిందని ప్రముఖ కవి డాక్టర్ కృష్ణంరాజు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్కే కన్వెన్షన్ హాల్‌లో పాటే మా ప్రాణం సంగీత అకాడమీ, బన్నీ డ్యాన్స్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన శిక్షణ శిబిరంలో పాల్గొన్న చిన్నారులకు ప్రశంసాపత్రాలు, పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. కార్య క్రమంలో నృత్య శిక్షకురాలు నవ్య, కళాకారుడు చెని కారపు నాగరాజు, నరేశ్, మంజుల, శ్వేత, స్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


