● భూసారం పెరిగే అవకాశం ● అధిక దిగుబడులు సాధ్యం
లక్ష్మణచాంద: పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులు సాధించే అవకాశమున్నట్లు వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఏటా ఒకే రకమైన పంట సాగు చేస్తే భూమిలో సారం క్రమంగా తగ్గి దిగుబడులపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పంట మార్పిడి విధానంతో నేలలో పోషకాలు వృద్ధి చెందుతాయని, తద్వారా దిగుబడి పెరిగే అవకాశముంటుందని పేర్కొంటున్నారు.
చీడపీడలకు అడ్డుకట్ట
ఒకే పంటను ఒకే పొలంలో వరుసగా సాగు చేస్తే చీడపీడల ఉధృతి పెరుగుతుంది. పురుగు జీవితచక్రం నిరాటంకంగా ముగించుకుని పంటలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశముంటుంది. పంట మార్పి డి చేసినప్పుడు పురుగు జీవితచక్రం నాశనమవుతుంది. వేగంగా వృద్ధి చెందే కొన్ని రకాల పురుగుల ను పంట మార్పిడి విధానంతో అదుపు చేయవ చ్చు. ఒకే లోతు వ్యవస్థ కలిగిన పత్తి, మిరప, వాణిజ్య పంటలను పంట మార్పిడి చేయకుండా సాగు చేస్తే ఒకే లోతు పొర నుంచి పోషకాలు తీసుకోవడంతో నేల పూర్తిగా నిస్సారమవుతుంది. వరి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న పంటలు నేల పైపొరల నుంచి పోషకాలను గ్రహిస్తాయి. నేల భౌతిక లక్షణాలు, స్వభావం దెబ్బతినకుండా ఉండటానికి చీడపీడల ఉధృతి నిరోధానికి పంట మార్పిడి చేయాలి.
ప్రయోజనాలివే..
వరి తర్వాత మినుము, పెసర, శనగ లాంటి పంటలు సాగు చేస్తే వరిలో వచ్చే సుడి దోమ, టుంగ్రో వైరస్ తెగుళ్లను నివారించవచ్చు. పత్తి వేసిన పొలంలో మొక్కజొన్న, జొన్న, నువ్వు, మినుము లాంటి పంటలు సాగు చేస్తే పత్తి పంటను ఆశించే లద్దె పురుగు, పచ్చ పురుగుల బెడదను అరికట్టవచ్చు. జొన్న, మొక్కజొన్న తర్వాత కంది సాగు చేస్తే కా యతొలుచు పురుగు ఉధృతి తగ్గుతుంది. వరి వేసిన పొలాల్లో ముందుగా పుప్పు ధాన్యాలు సాగు చేస్తే నేల సారవంతమవుతుంది. వేరుశనగలో ఆకుముడతను నివారించేందకు పప్పు జాతికి చెందిన పంటలతో మార్పిడి చేయాలి. కంది, మిరప పంటల్లో ఎండు తెగులు నివారణకు జొన్న, మొక్కజొన్న పంటలతో మార్పిడి చేయాలి. నులిపురుగు సమస్య అ ధికంగా ఉన్న ప్రాంతాల్లో వేరుశనగ, మిరప లాంటి పంటల సాగును కొన్ని సంవత్సరాల వరకు ఆపా లి. ఆహార పంటలైన వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పంటలను పప్పు జాతి పంటలైన పెసర, మినుము, వేరుశనగ లాంటి పంటలతో పంట మా ర్పిడి చేయాలి. ఆహార వాణిజ్య పంటలను పశుగ్రా స పంటలతో ఒకసారి, పప్పు జాతి పంటలతో మ రోసారి పంట మార్పిడి చేయడం లాభదాయకం.
మార్పిడితో మంచి దిగుబడి
అన్నదాతలు ఎప్పుడూ ఒకేరకమైన పంటలు వే యొద్దు. పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. దీంతో నేల సారం పెరిగి పంటలకు పోషకాలు స మృద్ధిగా అందుతాయి. తద్వారా మంచి ది గుబడులు సాధించవచ్చు. రోగ కారక పురుగుల జీవితచక్రం ముగియడంతో పంటలపై రోగాల ఉధృతి తగ్గుతుంది.
– వసంత్‌రావు, ఏవో, లక్ష్మణచాంద
● భూసారం పెరిగే అవకాశం ● అధిక దిగుబడులు సాధ్యం


