మిల్లర్లపై చట్టపరమైన చర్యలు
నిర్మల్‌చైన్‌గేట్: దీర్ఘకాలంగా సీఎంఆర్ ధాన్యాన్ని ఇవ్వని రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారుల ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందే సీఎంఆర్ (కస్టమర్ మిల్లింగ్ రైస్) ధా న్యాన్ని దీర్ఘకాలంగా ఇవ్వని రైస్‌మిల్లర్లపై రెవె న్యూ రికవరీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొంతమంది మిల్లర్లకు నోటీసులు జారీ చేసి, వారి ఆస్తులను గుర్తించి బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఇంకా బకాయిలున్న మిల్లర్లను గుర్తించి వారి ఆస్తులను బ్లాక్ చే యడంతో పాటు, బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సిందిగా సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి మిల్లర్లకు బ్యాంక్‌లు ఎలాంటి రుణాలు మంజూరు చేయకూడదని సూచించారు. మండ ల స్థాయిలో విత్తనాల దుకాణాలపై నిరంతర త ని ఖీలు నిర్వహించాలని, నకిలీ విత్తనాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్, ఆ ర్డీవోలు రత్నకళ్యాణి, కోమల్‌రెడ్డి, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.


