ధాన్యంబస్తాతో కలెక్టరేట్‌కు..
● తేమ సాకుతో కొనడం లేదంటూ ఆవేదన.. ● కలెక్టర్ చాంబర్ ఎదుట రైతు నిరసన
నిర్మల్: తేమ సాకుతో తమ ధాన్యం కొనడం లేద ని, కోతలు ఎక్కువగా పెడుతున్నారని ఓ రైతు కు టుంబం ధాన్యంతో కలెక్టరేట్‌కు వచ్చింది. లక్ష్మ ణచాంద మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు లింగన్న, శ్రీనివాస్ ఇద్దరూ గురువారం కలెక్టరేట్‌కు వచ్చారు. తమవెంట తీసుకువచ్చిన ధాన్యం బస్తాను మోసుకుంటూ కలెక్టర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వడ్లు పోసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా, సిబ్బంది అడ్డుకున్నారు.
కొర్రీలు పెడుతున్నారు..
బాబాపూర్ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో సుమారు 600 బస్తాల ధాన్యం కొనడం లేదని వారు పేర్కొన్నారు. ధాన్యం తేమశాతం రావడం లేదని, ఎక్కువ కటింగ్ చేస్తానని ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోయారు. తమ బాధ తెలుపాలన్న ఉద్దేశంతోనే వడ్లబస్తాలతో కలెక్టరేట్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్‌ను కలవగా, ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.


