
ఉత్తమ ఉద్యోగులకు ప్రగతిచక్రం అవార్డులు
భైంసాటౌన్: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో శనివారం ప్రగతిచక్రం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు ఉద్యోగులకు డీఎం హరిప్రసాద్ అవార్డులు అందజేశారు. కండక్టర్లు భూమేశ్, కవిత, ఎల్‌ఎస్.గౌడ్, డ్రైవర్లు సంజీవ్, రఫీక్‌ఉద్దీన్, మల్లికార్జున్‌తోపాటు మెకానిక్ సెక్షన్‌లో పనిచేసే నర్సయ్య, శివరాజ్, శంకర్, నరేందర్, రవీందర్ అవార్డులు అందుకున్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ భగవంత్‌రావు, ఉద్యోగులు పాల్గొన్నారు.