
‘చెయ్యని పనులకు బిల్లులివ్వొద్దు’
భైంసాటౌన్: చెయ్యని పనులకు బిల్లులివ్వొద్దని బీజే పీ నాయకులు కోరారు. బుధవారం మున్సిపల్ కా ర్యాలయానికి వచ్చిన ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాల మరమ్మతు పేరిట రూ.3.40లక్షలు, చలివేంద్రం పేరిట రూ.2లక్షలు, డ్రెయినేజీ పనుల పేరిట రూ.15లక్షలు బిల్లులు డ్రా చేశారని ఆరోపించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పట్టణంలోని పలు వార్డులతోపాటు కమలాపూర్ గుట్ట సమీపంలో డంప్‌యార్డు వద్ద పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని చెప్పగా, తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాజేశ్‌కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ అనీస్‌ను అదనపు కలెక్టర్ ఆదేశించారు. తైబజార్‌కు బహిరంగ వేలం నిర్వహించాలని కోరగా, త్వరలోనే వేలం నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు కపిల్ సింధే, రావుల రాము, రావుల పోశెట్టి, సాహెబ్‌రావు, అనిల్, రాజన్న తదితరులున్నారు.