
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
నిర్మల్‌టౌన్: కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా జడ్జి శ్రీవాణి సూచించారు. జూన్ 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారంపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు ఉన్నతాధికారులతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. జడ్జి మాట్లాడు తూ.. జిల్లాలో నేరాల అదుపునకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. కేసులు పరిష్కారం కాని సందర్భంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించేలా చూడాలని తెలిపారు. చట్టాల ఆవశ్యకతను వివరించాలన్నారు. జాతీయ న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ కోర్టుల్లో రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. ఇందులో క్రిమినల్, సివిల్, భూతగాదాలు, రోడ్డు ప్రమాదం, వివాహ, కుటుంబ తగాదాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని వివరించారు. సమావేశంలో జడ్జీలు, భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమార్, నిర్మల్ పట్టణ, రూరల్ సీఐలు ప్రవీణ్‌కుమార్, కృష్ణ, జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, పీపీలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
జిల్లా జడ్జి శ్రీవాణి