
ఆర్టీసీ సమ్మె విజయవంతం చేయాలి
నిర్మల్‌టౌన్ : ఆర్టీసీ కార్మికులు ఈ నెల 7 నుంచి చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని నిర్మల్ డిపో జేఏసీ చైర్మన్ పోశెట్టి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఆవరణంలో సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ట్రేడ్ యూనియన్‌లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ రాజేశ్వర్, కన్వీనర్లు నారాయణ, శేఖర్, హనుమంతు, రాజేశ్వర్, వేణు, మహిళా కండక్టర్లు ప్రతిభా, సవిత, శ్రీదేవి, సురేఖ, శ్రీలత, సజన, తదితరులు పాల్గొన్నారు.