
కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు
భైంసాటౌన్: పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ అన్నారు. ఇటీవల బీజేపీ పట్టణ, మండల, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికై న పలువురికి ఆదివారం పట్టణంలోని ఎస్‌ఎస్ ఇండస్ట్రీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే భైంసా మున్సి పల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలన్నారు. పదవులు రానివారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, నియోజకవర్గ, జిల్లా పార్టీ పదవులిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.