
వేధింపులు ఆపాలి..
ఖానాపూర్ మండలం పాత తర్లపాడ్ గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు 1991లో సర్వే నంబర్ 113లో ఒక్కో కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున భూమి కేటాయిస్తూ పట్టాలు మంజూరు చేశారు. 34 ఏళ్లుగా ఇందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. భూమి అభివృద్ధి పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. బ్లేడ్ ట్రాక్టర్, జేసీబీ లాంటివి ఉపయోగిస్తే సీజ్ చేస్తామని వేధిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఆంక్షలు, విధించడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. – పాత తర్లపాడ్, ఖానాపూర్