కుంటాల: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డన్‌సెర్చ్ నిర్వహించనున్నట్లు భైంసా ఏఎస్పీ అవినాష్‌కుమా ర్ తెలిపారు. మండలంలోని లింబా(కె)గ్రామంలో సోమవారం కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఇంటింటా సోదాలు చేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడారు. ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో ప్రజలు సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరి చిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు చెప్పవద్దని సూ చించారు. ప్రతీ వాహనదారుడు ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు పెడతామన్నారు. మహిళలకు భద్రత, భరోసా కల్పించేందుకు ఎస్పీ జానకీ షర్మిల ‘పోలీసు అక్క’కు శ్రీకారం చుట్టారని తెలి పారు. తనిఖీల్లో 82 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో స్వాధీనం చేసుకోగా మీసేవ ద్వారా చలాన్లు చెల్లించిన వాహనాలు అప్పగించారు. భైంసా రూరల్ సీఐ నైలు, ఎస్సైలు భాస్కరాచారి, రవీందర్, ఏఎస్సైలు జీవన్‌రావు, దేవన్న, పోలీసులు పాల్గొన్నారు.