తరగతిలోకి ఏఐ! | - | Sakshi
Sakshi News home page

తరగతిలోకి ఏఐ!

Mar 7 2025 9:34 AM | Updated on Mar 7 2025 9:29 AM

● ప్రాథమికస్థాయి నుంచే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగంపై విద్యాశాఖ దృష్టి ● విద్యా ప్రమాణాల పెంపునకు దోహదం ● ఇటీవల సమీక్షలో రాష్ట్ర మంత్రి, ఉన్నతాధికారుల సూత్రప్రాయ నిర్ణయం.. ● అమలైతే మరింత ప్రయోజనం

నిర్మల్‌ఖిల్లా: ప్రస్తుతం కృత్రిమ మేధా ప్రపంచాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లే సాధనంగా మారుతోంది. అయితే దీనిని రాష్ట్ర ఐటీ, పాఠశాల విద్యాశాఖ వి ద్యాబోధనలోనూ అమలుపరిచేందుకు కసరత్తు చే స్తోంది. ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా బు, విద్యాశాఖ కార్యదర్శి యోగితరాణాతో కలిసి విద్యాసంస్కరణలపై చర్చలో భాగంగా ఆర్టిఫీషి యల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగంపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతిష్టాత్మకంగా అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నా ప్రైవేటు విద్యాసంస్థల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కుంటోంది. అన్నిరకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా పేద, దిగువ మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ బడుల్లో విద్య నాణ్యత మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశా రు. జిల్లాలోనూ దాదాపు 850 పైగా ప్రభుత్వ విద్యా సంస్థలు కొనసాగుతుండగా 70 వేలకుపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ప్రతీ పాఠశాలలో కృత్రిమ మేధ వినియోగాన్ని అమలుపరిస్తే జిల్లా విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

క్షేత్రస్థాయి అనుభవాలు..

ఆర్టిఫిఫీయల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా విద్యాబోధనలో చెప్పాలనుకున్న పాఠ్యాంశాన్ని పూర్తిస్థాయిలో క్షేత్ర పర్యటనలో మాదిరిగా విద్యార్థికి అర్థవంతంగా బోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రతీసారి పాఠశాల నుంచి బయటకు వెళ్లి చూపించలేని అంశాలన్నీ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా విద్యార్థికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించవచ్చు. రోబోటి క్‌ లెర్నింగ్‌ కృత్రిమ మేధ వినియోగాన్ని బోధన అభ్యసన ప్రక్రియలో చేపట్టడం ద్వారా అభ్యసనం ఫలవంతమవుతుంది. విద్యార్థికి శాశ్వత జ్ఞానం ఏర్పడే అవకాశం ఉంటుంది. నేర్చుకునే అంశాలపై కుతూహలం పెరుగుతుంది. ఉపాధ్యాయుడికి విద్యార్థికి ప్రేరణాత్మకంగా ఉంటుంది..

ఇప్పటికే పెరిగిన సాంకేతికత...

జిల్లాలో బోధన అభ్యసన ప్రక్రియ పరిపుష్టం చేసేందుకు ఇప్పటికే ప్రతీ పాఠశాలకు ట్యాబ్‌లు, ఐఎఫ్‌బీ పానెల్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. వీటికి తోడు పీఎంశ్రీ పాఠశాలల ఎంపికై న 17 విద్యాసంస్థల్లో అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌లు కూడా పూర్తికానున్నా యి.. ఆడియో విజువల్‌ లర్నింగ్‌ ద్వారా పాఠ్యాంశాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల కు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధనలో సృజనాత్మక శైలులు జొప్పించేందు కు అధికారులు అంతర్గత శిక్షణలు కూడా అందిస్తున్నారు. తద్వారా ఉపాధ్యాయుడు సైతం మారుతు న్న కాలానికి అనుగుణంగా బోధన అభ్యసన ప్రక్రియను కొత్త పుంతలు తొక్కించేందుకు వీలుంటుంది..

ప్రభుత్వ బడులు మరింత బలోపేతం..

ఇప్పుడిప్పుడే ప్రభుత్వ బడుల్లో అన్నిరకాల వసతులు సమకూరుతున్నాయి. ప్రైవేటులో చదివించలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ నిర్ణయం వరం లాంటిది. విద్యార్థులకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన చేయడంతో వారికి పూర్తిస్థాయిలో అర్థవంతంగా ఉంటుంది. తద్వారా ప్రభుత్వం పాఠశాలలు కూడా మరింత బలోపేతం అవుతాయి..

– ఒడ్నాల రాజేశ్వర్‌, విద్యార్థి తండ్రి, పరిమండల్‌

సాంకేతికత వినియోగం అవసరమే..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తేవడం ద్వారా అభ్యసనం పూర్తిస్థాయిలో సఫలం అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికత వినియోగం అవసర మే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో బోధన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – తోట నరేంద్రబాబు,

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

తరగతిలోకి ఏఐ!1
1/2

తరగతిలోకి ఏఐ!

తరగతిలోకి ఏఐ!2
2/2

తరగతిలోకి ఏఐ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement