వసతిగృహాల్లో మరమ్మతులెప్పుడో? | Sakshi
Sakshi News home page

వసతిగృహాల్లో మరమ్మతులెప్పుడో?

Published Wed, May 22 2024 3:40 AM

వసతిగ

ఈ ఫొటోలో కనిపిస్తున్నది గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల వంటగదిలో ఫ్లోరింగ్‌ పగిలిపోయి ఉన్న దృశ్యం. అలాగే విద్యార్థులు నివాసం ఉండే డార్మెంటరీ ఫ్లోరింగ్‌ పగిలిపోయి సమస్యలు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు.
● నివేదికలు ప్రతిపాదనలకే పరిమితం ● జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభం ● సమస్యలకు స్వాగతం ● ఎన్నికల కోడ్‌ అమలు కారణంగా పనుల్లో జాప్యమంటున్న అధికారులు

ఆదిలాబాద్‌రూరల్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ శా ఖల పరిధిలో పలు వసతిగృహాలు కొనసాగుతుండగా ఏటా వందలాది మంది విద్యార్థులు విద్యను అ భ్యసిస్తున్నారు. గత నెలలో వేసవి సెలవులు ఇవ్వడ ంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లారు. ఆయా వసతిగృహా ల్లోని మరుగుదొడ్లు, స్నానపు గదులు, పైపులైన్లు, తలుపులు, కిటికీలు, తదితర మరమ్మతు పనులను సంబంధించిన ప్రతిపాదనలను వేసవి సెలవుల్లో ప్రభుత్వానికి నివేదిస్తారు. ఈ ఏడాది ప్రతిపాదనలు పంపించినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు. జూన్‌లో విద్యాసంస్థలు ప్రారంభం కానుండగా మరమ్మతులు చేపట్టకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపాదనలకే పరిమితం..

జిల్లాలో ఐటీడీఏ ద్వారా 133 వసతి, రెసిడెన్షియల్‌ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఆయా వసతి గృహాల్లో వివిధ మరమ్మతుల కోసం రూ.16 కోట్ల నిధులు అవసరం ఉందని సంబంధిత శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో 14 ప్రీ, పోస్టుమెట్రిక్‌ వసతిగృహాలు ఉన్నాయి. వాటిలో 7 వసతి గృహాల్లో మరమ్మతు చేసేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు కొలతలు సేకరించారు. వాటికి రూ. 87.70 లక్షలు అవసరముంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దళిత అభివృద్ధిశాఖ పరిధిలో 18 ప్రీమెట్రిక్‌, 3 పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలు ఉన్నా యి. వాటిలో రెండేళ్ల కిందట రూ.1.20 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈసారి తాత్కాలిక మరమ్మతు ఉంటే ఆయా వసతి గృహాలకు సంబంధించిన హెచ్‌డబ్ల్యూవోలు తమ దృష్టికి తీసుకువస్తే నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సంబంధిత శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

సకాలంలో ప్రారంభించకుంటే అంతే?

జిల్లాలోని ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న వసతి గృహాలలో వివిధ రకాల మరమ్మతుల పనులు సకాలంలో ప్రారంభించకపోతే పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం రోజే సమస్యలతో స్వాగతం పలుకనున్నాయి. అలాగే పనుల్లో సైతం నాణ్యత లోపించే అవకాశం ఉంటుందని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వసతి గృహాలలో మరమ్మతుల విషయంపై ‘సాక్షి’ ఆయా శాఖల అధికారులను సంప్రదించగా పాఠశాలలు పునః ప్రారంభంలోగా ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామని, ఎన్నికల కోడ్‌ అమలు కారణంగా నిధుల మంజూరులో జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు.

ఇక్కడ కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని బాలుర గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల దాహార్తి తీర్చే నీటి కుళాయిలు. వందలాది మంది విద్యార్థులకు గానూ ప్రస్తుతం రెండు మాత్రమే పని చేస్తున్నాయి. విద్యాసంస్థల పునఃప్రారంభంలోగా మిగతా వాటిని బిగించాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతు చేపట్టలేదు.

వసతిగృహాల్లో మరమ్మతులెప్పుడో?
1/1

వసతిగృహాల్లో మరమ్మతులెప్పుడో?

Advertisement
 
Advertisement
 
Advertisement