
మాట్లాడుతున్న నూతన్ కుమార్
నిర్మల్‌చైన్‌గేట్: సీపీఎం నిర్మల్ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఈనెల 13న పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పి.జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యుడు, నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి అడివయ్య హాజరవుతారని వివరించారు. ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించే విధానంపై చర్చించనున్నట్లు తెలిపారు. స కాలంలో కార్యకర్తలు హాజరై జయప్రదం చే యాలని కోరారు. సీపీఎం పట్టణ నాయకులు డి.పోశెట్టి, చందుల సాయికిరణ్ పాల్గొన్నారు.