ఘనంగా జ్యోతిబాపూలే జయంతి | Sakshi
Sakshi News home page

ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

Published Fri, Apr 12 2024 1:15 AM

పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బొజ్జు - Sakshi

నిర్మల్‌చైన్‌గేట్‌: సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతి బాపులే జయంతిని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం పూలే చేసిన కృషిని షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ వివరించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి

ఖానాపూర్‌: మహాత్మ జ్యోతిపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట అంబేద్కర్‌ సంఘం ఆధ్వర్యంలో గురువారం పూలే జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. జ్ఞానం అజ్ఞానాన్ని చీల్చి విజ్ఞానం వైపు అడుగులు వేస్తుంద ని స్యతశోధక్‌ సంస్థను స్థాపించి అణగారిన వర్గాల ను విద్యవైపు అడుగులు వేయించిన గొప్ప దార్శని కుడు జ్యోతిబాపులే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిన్నం సత్యం, కావలి సంతోష్‌, మేస సతీశ్‌, మునుగూరి నవీన్‌, నేత శ్యామ్‌, జన్నారపు శంకర్‌, ద్యావతి రాజేశ్వర్‌, అంబేద్కర్‌, రాసమల్ల అశోక్‌, ప్రణీత్‌, గోవింద్‌, తిరుమలేశ్‌, రాజ్‌కుమార్‌, గొర్రె గంగాధర్‌, త్రివేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పూలేకు నివాళులర్పిస్తున్న కలెక్టరేట్‌ సిబ్బంది
1/1

పూలేకు నివాళులర్పిస్తున్న కలెక్టరేట్‌ సిబ్బంది

Advertisement
 
Advertisement