‘గిరి’ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

‘గిరి’ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Published Thu, Apr 11 2024 8:05 AM

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు - Sakshi

ఆసిఫాబాద్‌రూరల్‌: గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని గిరిజన సంక్షేమ గెజిటెడ్‌ హెచ్‌ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి శేషాద్రికి వినతిపత్రం అందించారు. శ్రీరాములు మాట్లాడుతూ గిరిజన శాఖలో ఖాళీగా ఉన్న మండల విద్యాధికారులు, ఇతర పోస్టులు భర్తీ చేయాలన్నారు. గిరిజన ఉపాధ్యాయులకు వసతిగృహాల బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో వారికి గురుకులాల్లో అమలు చేస్తున్న వేతన స్కేల్‌ అమలు చేయాలని కోరారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, కాంట్రాక్టు టీచర్లను రెగ్యులర్‌ చేయాలని, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సారయ్య, సుధాకర్‌, ఉద్దవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement