
డీడీలు చెల్లించాలని సూచిస్తున్న మధుసూదన్‌నాయక్
రామకృష్ణాపూర్(చెన్నూర్): సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే డీడీలు చెల్లించి పట్టాలు పొందాలని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్ సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని డీడీలు చెల్లించని పలువురి ఇళ్లకు బుధవారం అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర రెవెన్యూ అధికారులు వెళ్లి అవగాహన కల్పించారు. ఈ నెలాఖరుతో గడువు ముగియనుందని, వెంటనే డీడీలు చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు పొందవచ్చన్నారు. ఆయన వెంట ఆర్డీవో వేణు, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ, వైస్ చైర్మన్ సాగర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.