
నేటి రోజుల్లో చాలామంది వర్క్ కల్చర్‌లో వినోదానికి పెద్దపీట వేస్తున్నారు. చివరికి ఉద్యోగానికి రిజైన్ చేసే విషయంలోనూ దానికి వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అత్యంత విచిత్రమైన రీతిలో రిజిగ్నేషన్ లెటర్ రూపొందించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ పోస్టులో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఆ సంస్థ రిజిగ్నేషన్ లెటర్ తయారు చేసింది.
ఈ పోస్టుకు 90 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి.అలాగే లెక్కకు మించిన కామెంట్లు వస్తున్నాయి. ఈ రిజిగ్నేషన్ లెటర్ చాలామందిని ఆకట్టుకుంది. మరికొందరు దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. రాజీనామా లాంటి సీరియస్ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఈ పోస్టులో చెప్పిన మాదిరిగానే తమన రిజిగ్నేషన్‌ను సెలబ్రేట్ చేసుకుంటామని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: మంచం కింద మొసలి.. మంచంపైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్లు తెరవగానే..
how to quit your job using Instamart 🚶♀️ pic.twitter.com/CyhSDyvWaq
— Swiggy Instamart (@SwiggyInstamart) July 24, 2023