మహిళలపై ఆరుగురు దాడి, కారణమేంటంటే...

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. ఆరుగురు వ్యక్తులు కలిసి ఒక మహిళపై దాడి చేశారు. భూమి సంబంధించిన విషయంలో వివాదం తలెత్తడంతో వారు మహిళపై అమానుషంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ, భూమి విషయంలో వివాదం తలెత్తడంలో ఆరుగురు వ్యక్తుల మహిళపై దాడి చేసినట్లు చెప్పారు. వారందరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి మరింత విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి