ఉదయం వేళ తప్పనిసరి.. బెంగాల్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు | West Bengal Makes Vande Mataram Compulsory In Schools From Monday | Sakshi
Sakshi News home page

ఉదయం వేళ తప్పనిసరి.. బెంగాల్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు

May 14 2026 2:15 PM | Updated on May 14 2026 3:04 PM

West Bengal Makes Vande Mataram Compulsory In Schools From Monday

కోల్‌కత్తా: పాఠశాలల్లో ఉదయం వేళ వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాఠశాల ప్రారంభంలో జరిగే ఈ జాతీయ గీతాలాపనలో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాల్గొనాలని.. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సోమవారం (మే 18 ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో వందేమాతరం ప్రార్థన గీతంగా ప్రవేశపెట్టనుంది. వచ్చే సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో వందేమాతరం ప్రార్థన గీతంగా మారుతుందని.. ముఖ్యమంత్రి సువేందు అధికారి అసెంబ్లీలో మీడియాకు తెలిపారు. గతంలో బెంగాల్‌లోని పాఠశాలల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతం 'జనగణమన' మాత్రమే పాడేవారు.

గత తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వం 1905 నాటి బెంగాల్ విభజన ఉద్యమ సమయంలో ఠాగూర్ రాసిన 'బంగ్లార్ మాటి బంగ్లార్ జోల్' పాటను రాష్ట్ర గీతంగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు బంకిం చంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇప్పుడు బంకించంద్ర ఛటోపాధ్యాయ రాసిన జాతీయ గీతం 'వందేమాతరం' కూడా ఈ జాబితాలో చేర్చడంతో తక్కువ సమయంలో ఈ పాటలన్నింటినీ ఏ క్రమంలో పాడాలనే అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement