‘దుమ్ము’ రేపిన విక్రమ్‌!

Vikram lander raised dust during Moon landing, created halo - Sakshi

బెంగళూరు: చంద్రయాన్‌–3లో భాగంగా పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్మును వెదజల్లింది. ఫలితంగా అక్కడ చిన్న గుంతలాంటి ప్రదేశం ఏర్పడినట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.

‘ఉపరితలంలోని ఏకంగా 2.09 టన్నులకు పైగా దుమ్ము, ధూళి, ఖనిజ శకలాల వంటివి 108 మీటర్ల పరిధిలో చెల్లాచెదురయ్యాయి. దాంతో విక్రమ్‌ చుట్టూ భారీ వలయాకార పరిధి (గుంత వంటిది) ఏర్పడింది’’ అని వివరించింది. ల్యాండింగ్‌కు ముందు, జరిగిన వెంటనే తీసిన ఫొటోలను ఉపగ్రహ ఆర్బిటార్‌లోని హై రిజల్యూషన్‌ కెమెరా సాయంతో హైదరాబాద్‌ జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ కేంద్రం సైంటిస్టులు ఈ మేరకు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top