Watch: UP Noida Vendor Sprinkling Drain Water On Coconuts, Arrested Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: ఛీ!.. ఇలానా కొబ్బరి బోండాలు విక్రయించేది..వీడియో వైరల్‌

Jun 6 2023 3:57 PM | Updated on Jun 6 2023 4:44 PM

UP Vendor Sprinkling Drain Water On Coconuts Goes Viral - Sakshi

ఈ వేసవిలో దాహార్తిని తీర్చడానికి కొబ్బరి బోండాలకు సాటి ఏదిరాదు. అలాంటి కొబ్బరి బోండాలు అనారోగ్యంగా ఉన్నప్పుడూ, లేదా పండగలు, శుభాకార్యాల్లోనే ఎంతగానో వినియోగిస్తాం. ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలా మంది కొబ్బరి బోండాలనే ప్రివర్‌ చేస్తుంటారు. కూల్‌డ్రింక్స్‌కి బదులు ఇవే ఆరోగ్యానికి మంచిదని వాటికే ప్రాధాన్యత ఇస్తారు చాలామంది.

ఐతే ఈ వీడియో చూశాక కచ్చితంగా ఓపినియన్‌ మారిపోవడమే గాక తాగేందుకు భయపడతాం కూడా. ఆఖరికి కొబ్బరి బొండాలను కూడా ఇలా కలుషితం చేసి మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా అని విస్మయం కలిగిస్తుంది ఈ వ్యక్తి చేసిన పని. 

ఆ వీడియోలో కొబ్బరి బోండాలను అమ్మే వ్యక్తి తన బండిపై ఉన్న లేత కొబ్బరి బోండాలపై డ్రైయిన్‌ వాటర్‌ చల్లుతున్నట్లు కనిపిస్తుంది. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. సదరు వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందని 28 ఏళ్ల సమీర్‌గా గుర్తించారు. 

(చదవండి: అభిమానానికి హద్దులు లేవంటే ఇదేనేమో!.. ఓ వ్యక్తి ధోనిపై ఉన్న ప్రేమను..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement