వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి | Udhayanidhi Stalin Sworn In As A Minister In The DMK Government | Sakshi
Sakshi News home page

వారసత్వ ముద్రను పనితీరుతో తొలగిస్తా: ఉదయనిధి

Dec 15 2022 7:45 AM | Updated on Dec 15 2022 7:45 AM

Udhayanidhi Stalin Sworn In As A Minister In The DMK Government - Sakshi

ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌(45) బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణంచేశారు.

సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌(45) బుధవారం రాష్ట్ర మంత్రిగా ప్రమాణంచేశారు. చపాక్‌–తిరువళ్లికేని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయిన ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని డీఎంకే వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్‌చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో చెన్నైలో గవర్నర్‌ అధికార నివాసం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఈయన చేత మంత్రిగా ప్రమాణంచేయించారు.

పార్టీలో యువజన విభాగం కార్యదర్శి అయిన ఈయనకు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖను డీఎంకే సర్కార్‌ కేటాయించింది. కుటుంబ రాజకీయాలను విమర్శించే వారికి తన అద్భుత పనితీరు ద్వారా సమాధానం చెప్తానని ఈ సందర్భంగా ఉదయనిధి వ్యాఖ్యానించారు. తమిళనాడు రాష్ట్రాన్ని దేశానికే క్రీడా రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పారు.

ఇదీ చదవండి: Gujarat Election 2022: గుజరాత్‌ ఓటేసిందిలా...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement