తల్లిపై అమితమైన ప్రేమ.. ఆ కొడుకులు ఏం చేసారంటే!     

Two Sons Build Temple For Their Deceased Mother Tamil Nadu - Sakshi

సేలం: కన్న తల్లిపై ప్రేమతో ఇద్దరు కుమారులు ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నారు. నామక్కల్‌ జిల్లా రాశిపురం సమీపంలోని నావల్‌పట్టి కాట్టూర్‌ గ్రామానికి చెందిన ముత్తుసామి (82), అలమేలు (72)కు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు మురుగేశన్‌ న్యాయవాది, చిన్న కుమారుడు పచ్చముత్తు రైతు. కాగా అలమేలు అనారోగ్యంతో 2019లో మృతి చెందింది.

దీంతో వీరి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. తమ తల్లిపై అమితమైన ప్రేమ కలిగిన మురుగేశన్, పచ్చముత్తు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తల్లి జ్ఞాపకంగా ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తమ వ్యవసాయ భూమిలో తల్లి నల్లరాళ్లతో ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో రెండున్నర అడుగుల ఎత్తు గల అలమేలు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి రోజూ విగ్రహానికి పాలాభిషేకం, పూజలు చేస్తూ తల్లిపై తమకున్న ప్రేమను చాటుకుంటున్నారు.

                                                                                                          

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top