‘తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్‌లో చర్చిస్తాం’

TRS MP Nageshwar Rao Comments On Telangana Issues  - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో జరిగే వర్షాకాల సమావేశంలో తెలంగాణ సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తుతామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత ఎంపీ నాగేశ్వర్‌ రావు తెలిపారు. కాగా, ఆదివారం పార్లమెంట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి అఖిల పక్షం ఆధ్వర్యంలో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థ, ధరల పెరుగుదలపై చర్చలు జరపాలని పేర్కొన్నారు. అదేవిధంగా, 48 గంటల ముందే బిల్లుల వివరాలను సభకు తెలపాలని కోరినట్టు నాగేశ్వర్‌రావు తెలిపారు. తెలంగాణకు రావాల్సిన ప్రతి అంశంపై పార్లమెంట్‌లో చర్చిస్తామని వివరించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top