Top 10 Telugu Latest News: Morning Headlines 20th May 2022 Check Inside - Sakshi
Sakshi News home page

Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

May 20 2022 10:00 AM | Updated on May 20 2022 10:41 AM

Top10 Telugu Latest News Morning Headlines 20th May 2022 - Sakshi

యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్‌ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్‌(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్‌ పౌండ్ల) జాక్‌పాట్‌ కొట్టేశారు

1.. అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట 
యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్‌ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్‌(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్‌ పౌండ్ల) జాక్‌పాట్‌ కొట్టేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2.. Yasin Malik: ఉగ్ర నిధుల కేసులో యాసిన్‌ మాలిక్‌ దోషే
ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో కశ్మీర్‌ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌ను దోషిగా తేలుస్తూ గురువారం ఢిల్లీలోని ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నెల 25న అతనికి శిక్ష ఖరారు చేయనున్నట్టుగా వెల్లడించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3.. అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది?
అబద్ధాలకు హద్దేముంది? ‘ఈనాడు’కు సిగ్గేముంది? పతాక శీర్షికల్లో చెప్పినంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా? మీరేం రాస్తే అది నిజమైపోవటానికి ఇవి వైస్రాయ్‌ రోజులనుకున్నారా రామోజీరావు గారూ? కూలీల ఫొటోలు తీసి వారు రైతులంటూ.. దోపిడీకి గురయ్యారంటూ దుర్మార్గపు రాతలు రాస్తే ఎలా?  ఫోటోలతో సహా మీరు వేసిన అబద్ధాలను... వీడియోలతో సహా వివరించడానికి ‘సాక్షి’ ఉందిక్కడ.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.. Disha Encounter Case: తుది దశకు ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ కేసు 
 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచారం కేసు చివరి దశకు చేరుకుంది. సుప్రీంకోర్టులోని ఫస్ట్‌ కోర్టులో శుక్రవారం తుది వాదనలు జరగనున్నాయి. అనంతరం సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5.. దావోస్ బయలుదేరిన సీఎం వైఎస్‌ జగన్
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దావోస్‌ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. నేటి రాత్రికి (శుక్రవారం) దావోస్ చేరుకోనున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6.. Mahesh Babu-Trivikram: త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమాలో మరో స్టార్‌ హీరో!
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉన్న మహేశ్‌ త్వరలోనే త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7..Glenn Maxwell: గోల్డెన్‌ డక్‌ తప్పించుకొని మ్యాచ్‌ విన్నర్‌గా.. రూల్స్‌ మార్చాల్సిందే!
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గురువారం ఆర్‌సీబీ గుజరాత్‌ టైటాన్స్‌పై కీలక విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ.. కోహ్లి దంచుడు.. మ్యాక్స్‌వెల్‌ మెరుపులతో 18.4 ఓవరల్లో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8..వాట్సాప్‌ గ్రూప్‌.. సైలెంట్‌గా ఔట్‌! 
ఫ్రెండ్స్‌.. ఫ్యామిలీస్‌.. ఆఫీస్‌.. అపార్ట్‌మెంట్స్‌.. ఇలా ఒకటో, రెండో.. కాదు పదుల కొద్దీ వాట్సాప్‌ గ్రూప్స్‌.. వందల కొద్దీ మెసేజీలు.. ఒక్కోసారి ఫొటోలు, వీడియోలతో మెమరీ నిండిపోతుంది. గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్‌ అవుదామనుకున్నా.. ఏమైనా అనుకుంటారేమోనన్న ఉద్దేశంతో బలవంతంగా అయినాకొనసాగు తుంటారు. మరెలా..? ఏముందీ ఎవరికీ తెలియకుండా, గ్రూప్‌లో ఎగ్జిట్‌ నోటిఫికేషన్‌ రాకుండానే బయటపడొచ్చు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9.. Adani Group Enters Healthcare: ఏషియా కుబేరుడు గౌతమ్‌ అదానీ నెక్ట్స్‌ టార్గెట్‌ ఇదే?
పోర్టులు, విమానాశ్రయాల నుంచి సిమెంటు, ఇంధనం వరకూ వివిధ రంగాల్లోకి విస్తరించిన అదానీ గ్రూప్‌ తాజాగా హెల్త్‌కేర్‌ (ఆరోగ్య సంరక్షణ) విభాగంపైనా దృష్టి పెట్టింది. భారీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ చెయిన్స్, ఆఫ్‌లైన్‌..డిజిటల్‌ ఫార్మసీల కొనుగోళ్ల ద్వారా భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.. అన్నాఖబాలే దుబా..: సేవలో.. ది బెస్ట్‌!
ఏ అంశంలోనైనా అందరికంటే విభిన్నంగా, ప్రత్యేకంగా ఉన్నవారే ‘ది బెస్ట్‌’గా నిలుస్తారు. ప్రపంచంలోనే ‘ది బెస్ట్‌’ అని అనిపించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన ఆలోచనా దృక్పథం, సామాజికాభివృద్ధిపై ఉన్న మక్కువతో ‘అన్నా ఖబాలే దుబా’ ప్రపంచంలోనే ‘బెస్ట్‌ నర్సు’గా నిలిచింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement