
సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఈ ప్రక్రియతో శాస్త్రీయమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
పాట్నా: బిహార్‌లో కులాలవారీగా జనాభా గణన శనివారం ప్రారంభమైంది. ఈ లెక్కింపుని చరిత్రాత్మకమైనదిగా ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అభివర్ణించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఈ ప్రక్రియతో శాస్త్రీయమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కులాల వారీగా జనగణన ప్రారంభమైన సందర్భంగా తేజస్వి యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మహాఘటబంధన్‌లో అన్ని పార్టీలు కులజనగణనకు అనుకూలంగా ఉన్నాయని కేవలం బీజేపీ మాత్రమే విమర్శిస్తోందన్నారు.
‘‘రాష్ట్రంలో ఒక చరిత్రాత్మక ప్రక్రియ మొదలైంది. మహాఘట్‌బంధన్ ప్రభుత్వం ఈ భారీ కసరత్తుకి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన శాస్త్రీయమైన సమాచారం అందుబాటులోకి వచ్చి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయి’’ అని చెప్పారు. బీజేపీ నిరుపేదల వ్యతిరేక పార్టీ కాబట్టి ఈ తరహా ప్రక్రియలకు మద్దతునివ్వదని విమర్శించారు.
ఇదీ చదవండి: 4 ‘ఐ’లపైనే దృష్టి: మోదీ