సీమా హైదర్‌ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్‌..

Seema Haider Hoists Tricolour At Home in Noida - Sakshi

లక్నో: పాకిస్థాన్‌ నుంచి భారత్ వచ్చిన సీమా హైదర్‌ ఉత్తరప్రదేశ్‌లో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటోంది. ప్రియుడు సచిన్ కోసం స్వదేశం దాటిన ఈ వివాహిత తిరంగ జెండాను ఎత్తి నినాదాలు చేస్తోంది. యూపీలో 'హర్‌ గర్‌ తిరంగ' వేడుకల్లో భాగంగా నోయిడాలో తన తరుపున వాదించిన లాయర్‌తో సహా కలిసి వేడుకల్లో పాల్గొంది. దీనికి సంబంధించిన దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి.

అయితే.. పాక్ దేశీయురాలు సీమా హైదర్‌కు ఇటీవల ఓ మూవీ ఆఫర్ కూడా వచ్చింది. 'కరాచీ టు నోయిడా' పేరుతో నోయిడాకు చెందిన నిర్మాత అమిత్ జానీ ముందుకొచ్చారు. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. మహారాష్ట్రకు చెందిన రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా(ఎమ్‌ఎన్‌ఎస్‌) సీమా హైదర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.  ఆ తర్వాత ఆమె తన బాలీవుడ్ మూవీ ఆఫర్‌ను తిరస్కరించానని తాజాగా ప్రకటించారు. 

తన పిల్లలతో కలిసి పాకిస్థాన్ వదిలి నేపాల్‌ మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చేరింది సీమా హైదర్‌. తన ప్రియుడు సచిన్‌తో కలిసి నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తోంది. తాను తన ప్రియునితోనే ఉంటానని పాక్‌ పంపించవద్దని రాష్ట్రపతికి కూడా ఇటీవల అప్పీల్ చేసింది. 

సీమా మిస్టరీ..
2019లోనే సిమా హైదర్‌, సచిన్‌ ఆన్‌లైన్ గేమ్‌ పబ్జీలో పరిచయమయ్యారు. పరిచయం ప్రేమగా మారిన తర్వాత సచిన్‌ కోసం ఆమె దుబాయ్‌ వెళ్లి అక్కడి నుంచి నేపాల్‌ వెళ్లింది. అక్కడి నుంచి భారత్ చేరుకుంది. పాకిస్థాన్ ఆర్మీతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో యూపీ యాంటీ టెర్రర్ విభాగం, ఇంటెలిజన్స్ విచారణ జరిపింది. సచిన్‌తోనే గాక ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని చాలా మంది యువకులతో పబ్జీలో ఆమెకు పరిచయం ఉందని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు గుర్తించారు. 

ఇదీ చదవండి: అజిత్‌తో రహస్య భేటీ.. ఇంట్లో వ్యక్తిని కలిస్తే తప్పేంటన్న శరద్‌ పవార్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top