బంగారు చేప: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు

Sea Gold Fish: Fishermen Ghol Fish Sold For Rs 1.33 crore In Maharashtra - Sakshi

భారీగా వలలో పడిన గోల్‌ ఫిష్‌

సముద్రపు బంగారంగా పేరుగాంచిన చేప

రూ.1.33 కోట్లకు 157 చేపల కొనుగోలు

అత్యంత అరుదైన.. ఎంతో విలువైన చేపగా ఖ్యాతి

Ghol Fish Price In Mumbai: నీలి విప్లవంతో మత్య్సకారుల బతుకులు కొంత బాగుపడ్డాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా పడుతుండడంతో మత్స్యకారులు బిజీగా మారారు. ఇలా చేపలు పడుతూ ఒక్కరోజే ఏకంగా కోటీశ్వరుడిగా ఓ వ్యక్తి మారాడు. ఆయన పట్టిన చేపలు అరుదైనవి.. పైగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. వేరే రాష్ట్రానికి చెందిన వ్యాపారస్తులు భారీ ధరకు ఆ చేపలను కొనుగోలు చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం)

మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌కు చెందిన చంద్రకాంత్‌ థారె మత్స్యకారుడు. వర్షాకాలం నేపథ్యంలో కొన్ని రోజులుగా నిలిపివేసిన చేపల వేటను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది. దీంతో చంద్రకాంత్‌ ఆగస్టు 28వ తేదీన సముద్ర తీర ప్రాంతం వద్వాన్‌కు హర్బా దేవీ బోటులో తన బృందంతో కలిసి వెళ్లాడు. చేపల వేట సాగించగా పెద్ద ఎత్తున చేపలు పడ్డాయి. వాటిలో సముద్రపు బంగారంగా పిలిచే అత్యంత అరుదుగా లభించే చేపలు ‘గోల్‌ ఫిష్‌’ భారీగా పడ్డాయి. 157 చేపలు పడడంతో వాటిని తీసుకుని వచ్చాడు. మార్కెట్‌కు తీసుకెళ్లగా ఆ చేపలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.
చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ

ఉత్తరప్రదేశ్‌, బిహార్‌కు చెందిన వ్యాపారస్తులు ఆ చేపలను ఏకంగా 1.33 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం. ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. ఒక్కో చేప విలువ రూ.85 వేల దాక పలికింది. అంతగా ఆ చేపను కొనుగోలు చేయడానికి కారణం ఉంది. ఆ చేపల ప్రత్యేకత ఏమిటో తెలుసుకోండి.గోల్‌ ఫిష్‌ చేప శాస్త్రీయ నామం ‘ప్రొటనిబి డయాకాంతస్‌’. ఈ చేపకు హంకాంగ్‌, మలేసియా, థాయిలాండ్‌, ఇండోనేసియా, సింగపూర్‌, జపాన్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. చాలా అరుదుగా లభించే ఈ చేపను వైద్య పరిశోధనలకు వినియోగిస్తారు. పైగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ చేప. ప్రస్తుతం కాలుష్యం కారణంగా ఆ చేపలు అంతగా లభించడం లేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top