ఆసుపత్రి విషాదంపై స్పందించిన ప్రధాని

Saddened by the tragic hospital fire in Ahmedabad : PM Modi  - Sakshi

విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల ఎక్స్-గ్రేషియా

గాయపడినవారికి  50వేల సాయం

సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్, అహ్మదాబాద్ ఆసుపత్రి విషాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మృతులకు సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. (ఘోరం : 8 మంది కరోనా రోగులు ఆహుతి)

ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, అహ్మదాబాద్ మేయర్​ బిజాల్ పటేల్​తో మాట్లాడినట్టు మోదీ తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. స్థానిక యంత్రాంగం బాధితులకు అన్నివిధాలా సహాయం అందిస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ కింద 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి  50వేల రూపాయలు సాయాన్ని అందిస్తున్నట్టు  ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top