ఎవరి అధ్యక్షతనైనా పనిచేయడానికి సిద్ధం | Priyanka Gandhi Ready to Work Under Non-Gandhi Congress Chief | Sakshi
Sakshi News home page

ఎవరి అధ్యక్షతనైనా పనిచేయడానికి సిద్ధం

Aug 19 2020 2:37 PM | Updated on Aug 19 2020 2:45 PM

Priyanka Gandhi Ready to Work Under Non-Gandhi Congress Chief - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రదీప్ చిబ్బర్, హర్ష్ షా రాసిన  పుస్తకం 'ఇండియా టుమారో: తరువాతి తరం రాజకీయనాయకుల సంభాషణలు' కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయానలను వెల్లడించింది.  కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా గాంధీ కుటుంబ నుంచి కాకుండా వేరు ఎవరు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన వారి కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పుస్తకంలో వెల్లడించారు.     

గత ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ప్రియాంక, జాతీయ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీ పదవి నుంచి వైదొలిగిన అనంతరం గాంధీయేతరుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడానికి ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. రాహుల్‌ గాంధీ కూడా తమ కుటుంబం నుంచి కాకుండా బయట వారిని అధ్యక్షులుగా వెతకాలని పేర్కొన్నట్లు ఈ పుస్తకంలో రాశారు.  రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన తరువాత సోనియా గాంధీ గతేడాది ఆగస్టులో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.     

గాంధీయేతర అధ్యక్షుడి గురించి ప్రియాంక మాట్లాడుతూ ‘మరొక పార్టీ అధ్యక్షుడు ఉంటే, ఆయన నా యజమాని అవుతారు. ఆయన ఒకవేళ నన్ను ఉత్తరప్రదేశ్‌లో వద్దు, అండమాన్‌ నికోబార్‌ దీవులకు వెళ్లు అని చెబితే నేను అక్కడి వెళతాను’ అని పేర్కొన్నారు అని  ఆ పుస్తకంలో తెలిపారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎన్నికై  ఏడాది పూర్తయిన తరుణంలో ఈ విషయాలు ఆసక్తికరంగా మారాయి.  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించి శాశ్వత పార్టీ చీఫ్‌ను నియమించాలని సభ్యులు కోరుతున్నారు. 

చదవండి: భూమిపూజపై ప్రియాంక కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement