
ఈ గొప్ప దేశానికి సేవ చేయటం నా అదృష్టం
గత 11 ఏళ్లలో దేశంలో గొప్ప మార్పు తీసుకొచ్చాం
ప్రధాని నరేంద్రమోదీ వెల్లడి.. ఎక్స్‌లో వరుస పోస్టులు
ప్రభుత్వాధినేతగా 25వ సంవత్సరంలోకి
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వాధినేతగా 24 సంవత్సరాలు పూర్తిచేసుకొని మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 12 సంవత్సరాలు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. దేశంలో ఓటమి ఎరుగని ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు సృష్టించారు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. ఈ గొప్ప దేశానికి సేవ చేసే అవకాశం రావటం తన అదృష్టమని పేర్కొన్నారు. ‘నా తోటి భారతీయులు నాపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. ప్రభుత్వాధినేతగా నేను 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు స్థిర చిత్తంతో గట్టి ప్రయత్నం చేశాను. ఈ గొప్ప దేశ ప్రగతికి నా వంతు కృషి చేశాను’అని పేర్కొన్నారు.
నిరాశ నుంచి గొప్ప స్థాయికి పయనం
తాను 2014లో దేశ ప్రధాని పదవి చేపట్టేనాటికి దేశంలో అవినీతి, ప్రజల్లో నిరాశ, నిస్పృహ నెలకొని ఉన్నాయని.. తన 11 ఏళ్ల పదవీ కాలంలో దేశం ఆ పరిస్థితి నుంచి బయటపడి.. ఎంతో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ‘2014 సార్వత్రిక ఎన్నికల కోసం 2013లో నన్ను బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొనే నాటికి యూపీఏ ప్రభుత్వం అవినీతి, కుటిలతత్వం, విధాన వైఫల్యాలకు పర్యాయపదంగా ఉంది. అంతర్జాతీయంగా బలహీన సంబంధాలు కలిగి ఉంది. కానీ, విజు్ఞలైన భారతీయులు మా కూటమికి, మా పారీ్టకి ఎన్నికల్లో అద్భుత మెజారిటీ ఇచ్చారు.
గత 11 ఏళ్లలో మనమంతా కలిసి ఎంతో మార్పు తీసుకొచ్చాం. ముఖ్యంగా మన మహిళా శక్తి, యువశక్తి, అన్నదాతలు ఎంతో స్వయంసమృద్ధి సాధించారు. 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ అద్భుత ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ పరిగణించబడుతోంది’అని ప్రధాని పేర్కొన్నారు.
సవాళ్లే నన్ను బలంగా మార్చాయి
ప్రభుత్వాధినేతగా మొదట్లో తాను ఎదుర్కొన్న సవాళ్లే తనను శక్తిమంతంగా మార్చాయని ప్రధాని మోదీ తెలిపారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదట అధికారం చేపట్టేనాటికి భారీ భూకంపం, తీవ్రమైన తుఫాన్, వరుస కరువులతో రాష్ట్ర ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. బలమైన సంకల్పంతో ప్రజలకు సేవ చేసేందుకు, గుజరాత్‌ను పునరి్నరి్మంచేందుకు ఆ సవాళ్లు నన్ను శక్తిమంతుడిని చేశాయి. నాడు గుజరాత్‌ను ఇక బాగు చేయలేం అన్నారు. కానీ, అందరం కలిసికట్టుగా కష్టపడి సుపరిపాలనకు గుజరాత్‌ను పవర్‌హౌస్‌గా మార్చాం’అని చెప్పారు.
తన తల్లి చెప్పిన మాటలు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘సీఎంగా ప్రమాణం చేసే సమయంలో మా అమ్మ నాకు ఒక మాట చెప్పారు. నీ పని ఏమిటో నాకు సరిగా తెలియదు కానీ.. రెండు విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఒకటి.. నువ్వు ఎప్పుడూ పేదల బాగు కోసమే పనిచేయాలి. రెండు.. లంచం తీసుకోవద్దు అని చెప్పారు. నేను కూడా ప్రజలకు అదే చెప్తాను. అవసరంలో ఉన్న చివరి వ్యక్తికి కూడా సేవ చేయటమే లక్ష్యంగా పెట్టుకోవాలి.