Old Illustration Goes Viral Amid Flood Situation In Delhi - Sakshi
Sakshi News home page

నాటి మొఘల్ చిత్రాలతో నేటి వరదల ఢిల్లీకి పోలిక.. ఫొటోలు వైరల్..

Published Sat, Jul 15 2023 12:30 PM

Old Illustrations Go Viral Amid Flood Situation In Delhi - Sakshi

ఢిల్లీ: దేశ రాజధానిలో వరదలు విజృంభించాయి. యమునా నది చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో ఉప్పొంగింది. ఢిల్లీ ప్రధాన మార్గాలపైకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ నదిలో మునిగిపోయాయి. చారిత్రక కట్టడాలైన ఎర్రకోట, సుప్రీంకోర్టుకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇంతకూ ఇంతటి పెను ప్రళయం ఎందుకని? ఎత‍్తైన ప్రాంతాలన్నింటినీ నదే ఆక్రమించిందా? లేక నది భాగాన్నే మనం ఆక్రమిస్తే.. ఈ విపత్తు సంభవించిందా? 

'నీరు పల్లమెరుగు' అని అంటారు పెద్దలు.. లోతట్టు ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తుందని అర్ధం. ఆ నీటి మార్గాన్నే మనం నది అంటున్నాం. మరి నది తన మార్గం మరవదు కదా..! అంటే మనమే దాని మార్గాన్ని ఆక్రమించామని చెప్పకనే అర్థమవుతోంది. అయితే.. ఓ ట్విట్టర్ యూజర్ మొఘల్ కాలం నాటి పిక్చర్స్‌ను ట‍్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆనాటి ఫొటోల్లో యమునా నది రెడ్ ఫోర్ట్‌ వెనక గోడలను ఆనుకుని ప్రవహిస్తున్నట్లు ఉంది. ఆనాటి పిక్చర్స్‌లో కనిపించినట్లే.. నేడు వరదలతో కూడిన ఢిల్లీలో దృశ్యాలు ఒకేలా ఉన్నాయంటూ ఆ నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. శతాబ్ధాలు మరిచినా.. నది మరువునా తన మార్గం అంటూ కామెంట్‌ పెట్టాడు.

ఇదీ చదవండి: Delhi Floods: రికార్డులు బ్రేక్‌ చేసిన యమున.. ఎర్రకోటను తాకిన వరద నీరు

'ప్రకృతి ఎప్పుడు తన ధర్మాన్ని మరవదు. తనదైన విషయాన్ని దేన్ని వదలదు. అంతటిని మళ్లీ కలిపేసుకుంటుంది' అని అర్థం వచ్చేలా మరో ట్విట్టర్ యూజర్ తన కామెంట్‌లో పేర్కొన్నాడు. దశాబ్దాలు గడిచినా యమునా నది తన మార్గాన్ని మరవలేదంటూ మరికొందరు స్పందించారు. మనం నది మార్గాన్ని ఆక్రమించుకున్నప్పటికీ బలీమైన శక్తితో అది తన మార్గాన్ని మళ్లీ తీసుకుంటుందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. 

ప్రస్తుతం వరదలతో యమునా నది ప్రవాహం 45 ఏళ్ల నాటి రికార్డులను బ్రేక్ చేసింది. 207.49 మీటర్లకు చేరి ఢిల్లీని ముంచెత్తే ప్రయత్నమే జరిగింది. ఢిల్లీలో ప్రధాని భాగాలైన మహాత్మా గాంధీ రాజ్‌ఘాట్‌, దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న సుప్రీంకోర్టు వరకు యమునా వరద నీరు వచ్చి చేరిందంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాలనీలన్నీ జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్థమైంది. త్రాగునీరు వ్యవస్థలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చివరికి దేశ సైన్యం ఎంట‍్రీ ఇచ్చే  స్థాయికి పరిస్థితి చేరింది.  

ఇదీ చదవండి: Delhi Floods Highlights: ఇంకా జల దిగ్బంధంలోనే ఢిల్లీ

Advertisement
Advertisement