హ్యాక్‌ అయితే 7 లోపు సంప్రదించండి

NSO Pegasus spyware used to hack US diplomats phones - Sakshi

పెగసస్‌ స్పైవేర్‌ బాధితులకు సూచించిన ‘సుప్రీం’ ప్యానెల్‌

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని ఎన్‌ఎస్‌వో సంస్థ తయారీ నిఘా సాఫ్ట్‌వేర్‌ ‘పెగగస్‌’ కారణంగా మొబైల్‌ఫోన్‌ హ్యాకింగ్‌కు గురైనట్లు భావించే బాధితులు జనవరి ఏడో తేదీ లోపు తమను సంప్రదించాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ ప్రజలకు సూచించింది. ఈ మేరకు కమిటీ ఆదివారం ఒక పబ్లిక్‌ నోటీస్‌ను జారీచేసింది. ‘ పెగసస్‌ మాల్‌వేర్‌ తమ ఫోన్‌ను హ్యాక్‌ చేసిందని ఎందుకు భావిస్తున్నారో తగు కారణాలను కమిటీ ముందు ఆయా బాధితులు వెల్లడించాలి.

హ్యాక్‌ అయిన మొబైల్‌/డివైజ్‌ను టెక్నికల్‌ కమిటీ పరిశీలించేందుకు మీరు అంగీకరిస్తారా? అనే విషయాన్నీ కమిటీకి పంపే ఈ–మెయిల్‌లో స్పష్టం చేయాలి’ అని ఆ నోటీస్‌లో కమిటీ పేర్కొంది. ‘ మీ కారణాలు సహేతుకమైనవని కమిటీ భావిస్తే ఆ మొబైల్‌/డివైజ్‌ను కమిటీ పరిశీలన/పరీక్ష/దర్యాప్తునకు తీసుకుంటుంది’ అని నోటీస్‌లో పేర్కొన్నారు. విపక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, జడ్జీలు సహా ప్రముఖుల మొబైల్‌ ఫోన్లను మోదీ సర్కార్‌ పెగసస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ చేసి నిఘా పెట్టిందని  పెను దుమారం చెలరేగిన విషయం విదితమే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top